TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

లోకనాథం నందికేశ్వరరావు

The Typologically Different Question Answering Dataset

1984 లో తొలిసారి జాతీయ కళాకారునిగా గుర్తింపు పొందాడు. సిమ్లాలో ప్రదర్శన నిస్తుండగా అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు జాతీయ కల్చరల్ అసోషియేషన్ సభ్యునిగా నియమించాడు. ఉత్తమ మిమిక్రీ కళాకారునిగా ఎనిమిది సార్లు పురస్కారాలు, రాష్ట్ర స్థాయిలో మూడు బంగారు పతకాలు అందుకున్నాడు. మిమిక్రీ కళను క్యాసెట్ల ద్వారా ప్రజలకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి ఆయన. 22 క్యాసెట్లను వివిధ ప్రక్రియలలో చేసి విడుదల చేసాడు. ఆంధ్ర, ఒడిషా, తమిళనాడు, కేరళ, భూపాల్, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హిమాచల ప్రదేశ్ లలో తన ప్రదర్శనలిచ్చాడు. మాజీ ముఖ్య మంత్రి.ఎన్.టి.రామారావు చే ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర కళాకారునిగా సత్కారం పొందాడు. జిల్లాలో పలు సంస్థలు ఆయనకు అనేక సార్లు అవార్డులనిచ్చి సత్కరించాయి. ఆలిండియా రేడియోలో అనేక ప్రదర్శనలిచ్చాడు. క్లియోపాత్రా నాటకంలోని ఏంటొని స్పీచ్ ను తన అనుకరణ ద్వారా ప్రేక్షకులకు వినిపించటమే కాక క్యాసేట్ కూడా తయారు చేసాడు. పలు సాంఘిక నాటకాలలో నటించి తన ప్రతిభను చాటుకున్నాడు. ఎనిమిదవ తరగతి లో ఉండగానే 'విముక్తులు ' అనే నాటకంలో నటించి ఉత్తమ బాల నటుని అవార్డును స్వతం చేసుకున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులైన జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, ఎన్.టి.రామారావు, నారా చంద్రబాబునాయుడుల ద్వారా అనేక సార్లు సన్మానించ బడ్డాడు. అప్పటి రాష్ట్ర గవర్నర్ కుముదబెన్ జోషి చేతుల మీదుగా సన్మానించ బడ్డాడు. అప్పటి కేంద్ర మంత్రి కె.యర్రంనాయుదు చెతుల మీదుగా సన్మానించ బడ్డాడు. అనకాపల్లి, రాజమండ్రి, పొద్దుటూరు, హైదరాబాద్ సభలలో ఆయనకు బంగారు పతకాలు వచ్చాయి. తన ప్రదర్శనలలో జాతర, ట్రిపుల్ మ్యూజిక్, ఓంకారం, రుద్రవీణ, రామాయణ మహాభారత యుద్దాల ప్రక్రియలు అనేక అవార్డులు తెచ్చి పెట్టాయి. ఆయన 'నవ్వుల పల్లకి ' అనే టెలిఫిలిం ను రచించి, నిర్మించి నటించారు. ఇది స్థానిక సిటి కేబుల్ ద్వారా ప్రదర్శించ బడింది. ఆయన రచించిన ' అక్షరం శరణం గచ్చామి" అనే టెలి ఫిలిం డి.డి.1 ద్వరా ప్రదర్శించబడింది. ఆయన నిర్మించిన 'ప్రగతికి పంచ సూత్రాలు ' అనే టెలిఫిలిం స్థానిక సిటి కేబుల్ ద్వారా ప్రదర్శించ బడింది. ఆయనకు పిల్లలంటే ఎంతో యిష్టం. ఆ మమకారంతోనే పిల్లలను నవ్వించి వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి 2003 లో స్థానిక రివర్ వ్యూ పార్క్ వద్ద చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్ ను ఏర్పాటు చేసారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉగాది పురస్కారం.[2]

2017లో లోకనాథం నందికేశ్వరరావు ఏ రాష్ట్ర ప్రభుత్వం చే ఉగాది పురస్కారంను అందుకున్నాడు?

  • Ground Truth Answers: ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్

  • Prediction: